ఐడీబీఐ శాఖల్లో ఎగ్జిక్యూటివ్స్ ! 1 m ago
ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్) కాంట్రాక్ట్ ప్రాతిపదికన 2025-26 సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న ఐడీబీఐ శాఖల్లో ఎగ్జిక్యూటివ్ (సేల్స్ అండ్ ఆపరేషన్స్) 1000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అభ్యర్ధుల విద్యార్హత డిగ్రీ, కంప్యూటర్/ ఐటీ సంబంధిత అంశాల్లో నైపుణ్యం ఉండాలి. వయసు 20 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. జనరల్ అభ్యర్ధులు రూ. 1050 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు రూ. 250. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నవంబర్ 16 లోపు దరఖాస్తు చేసుకోగలరు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి ను సంప్రదించగలరు.